తేజ సజ్జ (Teja Sajja) హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై గ్రాండ్ గా తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ పాన్ ఇండియన్ ఎంటర్టైనర్ సినిమా మిరాయ్ (Mirai). రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియా శరన్ కీలకపాత్ర చేస్తుండగా మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు.
గౌరహరి సంగీతం అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ తో పాటు గ్లింప్స్ టీజర్, ట్రైలర్ అన్ని కూడా అందర్నీ ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. సెప్టెంబర్ 12న ఈ మూవీ పలు భాషల్లో గ్రాండ్ గా ఆడియన్సు ముందుకు రానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో టీ ప్రమోషన్స్ ని విరివిగా నిర్వహిస్తోంది.
విషయం ఏమిటంటే నేడు కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రాంతంలోని కొన్ని లిమిటెడ్ స్క్రీన్స్ లో మిరాయ్ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడున్న ట్రెండును బట్టి చూస్తే సినిమాకి మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ అయితే వచ్చే అవకాశం కనబడుతోంది.
మరోవైపు ఈ సినిమా యొక్క అమెరికా బుకింగ్స్ కూడా బాగానే జరుగుతున్నాయి మొత్తంగా తమ సినిమా భారీ విజయం ఖాయమని మిరాయి టీం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరి ఓవరాల్ గా ఓపెనింగ్ ఏ స్థాయిలో అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి
0 comments:
Post a Comment